Take a fresh look at your lifestyle.

పేదవాడి సొంతింటికలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సామల ధర్మరాజు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

పేదవాడి సొంతింటికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మాన్ అధ్యక్షులు సామల ధర్మరాజు అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని 2వ వార్డుమాస్కుంటలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గుర్రం అనూష ముత్యాలు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై 5000 రూపాయల ఆర్థిక సహాయంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు షాగంటి రాంచందర్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు తోర్రి సురేష్, ఇందిరమ్మ కమిటి సభ్యులు పోకల యాదగిరి, లతీఫ్, ఇండ్ల లక్ష్మి, లింగాల జంగమ్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.