ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు. రానున్న రోజుల్లో సైతం నరేష్ గౌడ్ పట్టణ ప్రజలతో పాటు ఇటు జర్నలిస్టుల సంక్షేమానికి కోసం కూడా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.