Take a fresh look at your lifestyle.

ముగిసిన గడువు… ఇంకా లొంగిపోని మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి…

 
లొంగిపోతే అన్ని రకాల ఆదుకుంటామని డీజీపీ ప్రకటన…
గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్….

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

మావోయిస్టులు లేని దేశంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చేసి విజయం సాధించారనే చెప్పవచ్చు. అయితే ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. ఇంకా మిగిలి ఉన్న కొంతమంది కోసం మార్చి 31 లోపల లొంగిపోవాలని డెడ్లైన్ విధించగ, ఈ డెడ్ లైన్ మంగళవారంతో ముగిసింది.

ఇంకా అజ్ఞాతంలోనే గణపతి…

మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరింది. ఇందులో భాగంగా కొంతమందిని ఎన్కౌంటర్ చేసి ఏరి వేయగా, మరికొంత మందిని లొంగిపోయే విధంగా చేసి వారికి అన్ని రకాల అండగా నిలిచారు. గడిచిన రెండేళ్లలో 721 మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిని ఇప్పటికే లొంగిపోవాలని చాలాసార్లు పోలీసులు, కేంద్రం ప్రకటించిన ఇంతవరకు లొంగిపోలేదు. మార్చి 31 లోపు లొంగిపోవాలని గడువు విధించిన పట్టించుకోని గణపతి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు విధించిన గడువు మార్చి 31 తో ముగియగా, తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

ఇంకా మిగిలినది 8మందే…

భూస్వామ్య, పెట్టుబడిదారుల ఆగడాలకు వ్యతిరేకంగా మొదలైన మావోయిస్టు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి 5 దశాబ్దాలు ఏళగా, ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఐతే ఎంతోమంది చనిపోగా, కొంతమంది లొంగిపోయారు. ఇందులో భాగంగా ఇంకా ఎనిమిది మంది మిగిలి ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి వెంటనే లొంగిపోతే అన్ని రకాల అండగా ఉంటామని, అలాగే వైద్య సేవలు కూడా అందిస్తామని, వెంటనే లొంగిపోవాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి చివరిసారిగా కోరిన ఎలాంటి స్పందన కనిపించడం లేదు. అయితే గణపతితోపాటు కాజీపేటకు చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వార్త శేఖర్ అలియాస్ మగ్తు, జోడి రత్నాబాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, గంగ బోయిన భాగ్య అలియాస్ రూపీ లను కూడా వెంటనే లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.