ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలని జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జి బెక్కం జనార్దన్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేద్రంలోని ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జి బెక్కం జనార్దన్ ఆధ్వర్యంలో టి.యు.డబ్ల్యు జె(ఐజేయు)ఎన్నికల్లో గెలుపొందిన జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి బెంజెక్కి సంపూర్ణ చారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదరలీ,సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్, కోరేపు రాజ్ కుమార్,చింత నరేశ్, టిన్యూస్ మనోజ్, మహిళాజర్నలిస్టు సాకేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బొడ్డుపల్లి అంజయ్య, మదన్ మోహన్, బద్దం నారాయణ రెడ్డి, జనసేన పార్టీ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు బొల్లి రాము, ప్రధాన కార్యదర్శి పత్తి అజిత్ కృష్ణ, రాయకల్ మండల కమిటీ ప్రధాన కార్య దర్శి బత్తిని బాబు, బెక్కం ప్రవీణ్, నరేష్, పత్తి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
