ముద్ర ప్రతినిధి, మెదక్:
సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ పంటతోనే రైతులకు అధిక లాభాలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పరిశీలించారు.
రైతులతో ముచ్చటించారు. వాణిజ్య పంటలపై రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయిల్ ఫామ్ పంట సాగు విధానం, దిగుబడి పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తూ ఆయిల్ ఫామ్ పంటను సమర్థవంతంగా సాగు చేయాలని సూచించారు.;

ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగును మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు కోసం 2,500 ఎకరాలు లక్ష్యంకాగా, ఇప్పటికే 2000 ఎకరాలు సాగు అయిందని తెలిపారు. ఈనెల 20, 21, 22 తేదీలలో సిద్దిపేట జిల్లాలోని ఆయిల్ ఫామ్ పంటల సాగు పరిశీలన కోసం 70 బస్సులు ఏర్పాటు చేసి మెదక్ జిల్లా రైతులను పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని
కలెక్టర్ ప్రతిమా సింగ్ వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పాపన్నపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ డిఎంహెచ్వో హరిప్రసాద్, మెడికల్ ఆఫీసర్ అన్వర్, సిహెచ్ఓ చందర్ మెడికల్ సిబ్బంది తదితరులున్నారు.