Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి -మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.

మోత్కూర్ ముద్ర న్యూస్:

మోత్కూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరీ కిషోర్ కుమార్ అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా నిర్వహించిన భారీ బైకు ర్యాలీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రాలని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీలో 11 మంది బిఆర్ఎస్ అభ్యర్థులను బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థిని మొత్తం కలుపుకొని 12 వార్డులలో టిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు మోత్కూర్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులన్నీ టిఆర్ఎస్ హయాంలోనే జరిగానే రోడ్ల విస్తరణ మినీ ట్యాంక్ బండ్ రోడ్డు డివైడర్లు స్ట్రీట్ లైట్లు ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిందని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదని గత మూడు సంవత్సరాలుగా రైతు బీమా అందించలేకపోయారని ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చడంలో విప్లమైందని ఆయన అన్నారు అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారనీ ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలని అన్నారు .పోలీసులు కూడా అతిగా వ్యవహరిస్తున్నారని రెండేళ్ల తర్వాత తమ అధికారులకు రాగల రెండు సంవత్సరాల్లో బి ఆర్ ఎస్ అధికారం లోకి రావడం ఖాయమని అప్పుడు అందరి సంగతి చూస్తామని ఆయన అన్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అందుకని ప్రతి ఓటర్ కారు గుర్తుపై ఓటు వేసి బి ఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ,ఎన్నికల ఇంచార్జ్ నేఊరి ధర్మేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జంగా శ్రీనివాస్ ,మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపి రెడ్డి మెగారెడ్డి, మాటూరి బాలరాజు, గుండు వెంకట నర్సు, కూరపాటి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.