Take a fresh look at your lifestyle.

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి.

  • నాలుగవ రాష్ట్ర మహాసభల గోడప్రతి ఆవిష్కరణ..
  • భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏశమేణి గణేష్

మెట్ పల్లి ముద్ర: మెట్ పల్లి పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయ ఆవరణ వద్ద గురువారం ఏఐటీయూసీ అనుబందం, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 21,22 తేదీలలో రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ లో జరిగే రాష్ట్ర నాలుగవ మహాసభల గోడ ప్రతిని టీ ఏస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఏశమేనీ గణేష్ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర 4వ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర మహాసభలకు అధికసంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపుఇచ్చారు కార్మికశాఖ లో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయాలని, నూతన లేబర్ కార్డులుజారీ చేయాలని, పాత కార్డులులు రెన్యువల్ చేయాలని, వివాహానికి రూ. 1 లక్ష రూపాయలు ,ప్రసూతి కి రూ. 50 వేలు, సహజమరణంకు రూ.5 లక్షలు, ఆక్సిడెంట్ మరణానికి రూ.10 లక్షలు, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెస్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం మానుకోవాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉపయోగించాలని,సెస్ నిధులను సక్రమంగా వసూలు చేయాలని అన్నారు.

44 కార్మిక చట్టాలను కాపాడాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన
4 కోడ్ లను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎశమేని గణేష్,జిల్లా ప్రధానకార్యదర్శి రామిళ్ల రాంబాబు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్,జిల్లా కార్యవర్గ సభ్యుడు బిజనపెల్లి మనోహర్, మాతంగి శ్రావణ్, కాత వినయ్,చౌదరి శివకుమార్,జనగంరమేష్, మారంపెళ్లిరాజశేఖర్,దేవేందర్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.