- భూ హక్కుల సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలి
- భూ సమస్యల సత్వర పరిష్కారం,
- రైతుల మేలు కోసం ప్రజాపాలన లో చారిత్రక మార్పు,
- అవగాహన సదస్సులో కలెక్టర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలు పై నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కేంద్రంలోనీ రైతు వేదిక కార్యాలయంలో తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భూ భారతి అవగాహన సదస్సు కార్యక్రమం లో భూ భారతి ఆర్ ఓ ఆర్ చట్టం పై జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ రికార్డులలో ని తప్పొప్పులను క్షేత్ర స్థాయిలో నీ రెవెన్యూ సిబ్బంది ద్వారా సవరించుకోనే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం గ్రామస్తులు అందరూ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు.భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీ -సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని, ఒకవేళ పరిష్కరించలేక పోతే చలాన్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని , భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు.
ధరణి స్థానం లో కొత్త భూమి హక్కుల రికార్డు భూ భారతి హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములను మ్యూటేశన్ చేసే ముందు నిర్ణీత కాలం లో విచారణ, భూమి హక్కులు ఏ విదంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు, పాసుపుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, భూదార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, అబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యు రికార్డుల నిర్వహణ, మోసపూరితనంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారాలు ఉంటాయని వివరించారు.
భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని,ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూముల పై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూ భారతి చట్టం పై అవగాహనను కల్పించుకొని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందనే దానిపై సలహాలు సూచనలు చేయవచ్చని అన్నారు.
రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర రైతాంగం ధరణి ద్వారా తమ భూ రికార్డులలో ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక భూ రికార్డుల చట్టం భూ భారతి చట్టం అంబేద్కర్ జయంతి రోజున అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. తెలంగాణ భూ భారతి చట్టం 2025 ద్వారా రైతుల కు చెందిన భూములకు రికార్డులను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ రెవెన్యూ అమరేందర్ , రైతు కమిషన్ సభ్యులు కే వీ నరసింహారెడ్డి, ఆర్ డి వో శ్రీనివాసులు, తహసిల్దార్ మురళీమోహన్, ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు,మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.