Take a fresh look at your lifestyle.

దొంగను పట్టిస్తే పది వేల నజరానా

హనుమకొండ, ముద్ర: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ లో నందనం భారతమ్మ (65) అనే వృద్దురాలు 300000 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి తన వాహనం పై మీ ఇంటివద్ద దింపుతా అంటూ మాయమాటలు చెప్పి స్కూటీ ఎక్కించుకొని ఫిరంగడ్డ వైపు ఆపి దింపి డబ్బులు సంచి తీసుకొని వెళ్లడం తో మహిళా పోలీసులను ఆశ్రయించగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేశారు.సీసీ కెమెరాల ఆధారంగా దొంగ చిత్రాన్ని విడుదల చేసి పట్టించిన వారికి 10,000 వేల(పదివేల) నజరనా ప్రకటించ్చారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.