Take a fresh look at your lifestyle.

నూతన మున్సిపల్ పాలకవర్గానికి శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వేద ఆశీర్వచనం సన్మానం

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరిలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం శబరినగర్ లో ఆదివారం భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు వేద ఆశీర్వచనం సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు, వెంకటేశ్వర శర్మ ఆశీర్వాదంతో ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ కర కమలములచే నూతనంగా ఎన్నుకోబడిన మంచికి మారుపేరు స్నేహశీలి ఆపదలో ఆదుకునే భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు మిగతా 33 మంది కౌన్సిలర్లకు వేద ఆశీర్వచనం మేమంటో శాలువా దండతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిండిసత్యం, ట్రెజరర్ శ్యాంసుందర్ ఘటాని, ప్రోగ్రాం చైర్మన్ గాదె శ్రీనివాస్, కో చైర్మన్ పోకల సోమన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటిమల రాములు, మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, బెల్లీదే వెంకటేష్, పసుపునూరి నాగభూషణం, మంచాల రిషికేష్, చామ రవీందర్, మంచుకొండ వినోద్, చింతా రవి, రావుల శ్రీధర్, సుధాకర్ గౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.