Take a fresh look at your lifestyle.

“ఎమ్మెల్యే,ఎంపీపై విమర్శలు సరికాదు”

  • తక్షణమే క్షమాపణ చెప్పాలి.

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్,పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నాయకులు చేసిన విమర్శలను పట్టణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు తీవ్రంగా ఖండించారు. కార్మికుల కోసం మాట్లాడాల్సిన యూనియన్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే,ఎంపీలపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఆదివారం స్థానిక సూపర్ బజార్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కనకం వెంకటేశ్వర్లు,ఐఎన్టీయూసీ నాయకులు తేజవత్ రాంబాబు,పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,మహంకాళి శ్రీనివాస్,గోవు రాజాం,పలిగిరి కనకరాజు మాట్లాడారు.అగ్ర నాయకుల మెప్పు కోసం విమర్శలు మానుకొని బలి పశువు కాకుండా ఉండాలన్నారు.మరోసారి నిరాధారమైన ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎంపీ,ఎమ్మెల్యే పైన చేసిన విమర్శలను వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అనంతరం అనారోగ్య కారణంతో మృతి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఎం.డి.మునీర్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు. జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్,గాండ్ల సమ్మయ్య,చంద్రగిరి ఎల్లయ్య,ఆకుల రాజన్న,మొట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.