Take a fresh look at your lifestyle.

క్యాతన్ పల్లిలో టుబిహెచ్కె లక్కీ డ్రా

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో (టుబిహెచ్కె) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హులైన 230 మంది లబ్ధిదారులకు నెంబర్లు కేటాయించేందుకు బుధవారం లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు మందమర్రి ఎమ్మార్వో పీ.సతీష్ కుమార్ తెలిపారు. పోచమ్మ బస్తీ సమీపంలోని సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్లో సంబంధిత ఏర్పాట్లను మంగళవారం మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పీ.సతీష్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారులను మాత్రమే లాటరీ నిర్వహించే ప్రాంగణంలోకి అనుమతించనున్నట్లు చెప్పారు. ఎమ్మార్వో కార్యాలయంలో లబ్ధిదారులకు ఇచ్చిన చీటీలతో పాటు ఆధార్ కార్డు,పాన్ కార్డు,ఓటర్ ఐడి కార్డు తప్పక వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.