- జీవో ఎంఎస్ నెంబర్ 25 ను అమలు చేయండి.
- మంత్రికి విన్నవించినఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని బిక్షపతి.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రాష్ట్రంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు గత 14 సంవత్సరాలు గా పెంచకుండా జి ఓ నెంబర్ 21 అమలు చేయకుండా కార్మికుల వేతనాలు పెంచడం లేదని వివరించారు. కార్మికుల కనీస వేతనం జీవో నెంబర్ 25 ప్రకారం 23,500 పెంచి వేతనాలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి దేవసాని బిక్షపతి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని కలిసి విన్నవించారు. హైదరాబాదులోని మంత్రిచాంబర్లో ఆయనను కలిసి కార్మికులు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇక్కడున్న పరిశ్రమ యాజమాన్యాలు పట్టించు కోవడంలేదని వేతన సవరణ చేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన మంత్రి త్వరలోనే క్యాబినెట్ సమావేశం లో చర్చించి కార్మికుల కన్నీస వేతనాలు 23,500 పెంచి అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల వేతనం సవరించి పెంచేందుకు మంత్రి హామీ ఇచ్చారని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని బిక్షపతి తెలిపారు.