ముద్ర, గండిపేట్ విలేకరి: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని వట్టినాగులపల్లి బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెడ్ కౌన్సిలర్ విష్ణువర్ధన్ అన్నారు. వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ పార్టీ గొప్ప ఆశయం కోసం ఆవిర్భవించి రాష్ర్టాన్ని సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు నుంచి పాలన పరమైన నిర్ణయాలకు అభాసుపాలవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిచారు. ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదన్నారు.కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.