Take a fresh look at your lifestyle.

సామాజిక ఉద్యమాలకు అండగా సీఐటీయూ విరాళాల సేకరణ

ముద్ర ప్రతినిధి, మెదక్:
సామాజిక ఉద్యమ కారుల జయంతుల సందర్భంగా సామాజిక ఉద్యమ నిధి సేకరణలో కార్మిక వర్గం భాగస్వామ్యం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ కేవల్ కిషన్ భవన్ లో సిఐటియూ జిల్లా కమిటీ సమావేశంలో మల్లేశం మాట్లాడుతూ దేశంలో నేటికి కుల వివక్ష అనేక రూపాల్లో కొనసాగుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుల వివక్షను సమర్ధిస్తూ అగ్రవర్ణాలకు అండగా నిలుస్తూ దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రైవేటీకరణ విధానాలను వేగం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా అధ్యక్షులు, బి.బాలమణి, కోశాధికారి నరసమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కె.నాగరాజు, సహాయ కార్యదర్శి జె.సంతోష్, జిల్లా కమిటీ సభ్యులు లహరి, పుష్ప, బాలేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.