Take a fresh look at your lifestyle.

సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ బృందానికి రాష్ట్ర స్థాయి ప్రశంస పత్రం

 

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య సేవల అందింపులో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు టాస్క్ బృందానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ప్రశంస పత్రం అందింది.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 7, 2026 ఆరోగ్య,వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఈసర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు.ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడంలో,నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంలో,అక్రమాలు అరికట్టడంలో సంగారెడ్డి బృందం చూపిన చురుకుదనం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరింత కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించి నాణ్యమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.