Take a fresh look at your lifestyle.

ఓటు హక్కు వజ్రాయుధం -జిల్లా రెవిన్యూ అధికారి మంగీలాల్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మంగిలాల్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కల్లెక్టరేట్ కార్యాలయ ఆవరణలో 16 వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ర్యాలి నిర్వహించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా జిల్లా అధికారులు, ఓటర్ల అందరిచే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు
అనంతరం 16 వ జాతీయ ఓటరు దినోత్సవము సందర్బంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అందరు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహనా కలిపించికోవాలని సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
18 సంవత్సరాలు పూర్తి అయిన ఎనిమిది మందికి ఓటు హక్కు కలిపిస్తూ ఎపిక్ కార్డ్స్ పంపిణి చేశారు. ప్రజాస్వామ్యములో 85 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకున్నఐదు మంది సీనియర్ సిటిజన్స్ కు ఈ సందర్బంగాశాలువా లతో సన్మానం చేశారు. ఓటరు అవగాహనా కార్యక్రమాలలో గెలుపొందిన వారికీ సర్టిఫికేట్ లు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా స్వీప్ అధికారి సత్తార్, తహసిల్దార్ లక్మినారాయణ, జిల్లా వైద్యాధికారి స్వర్ణ కుమారి, జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ, సిబ్బంది, వెంకటేష్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.