Take a fresh look at your lifestyle.

కుటుంబ పాలనకు చరమ గీతం పాడాం -నియోజకవర్గ ప్రశిక్షణా తరగతుల ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్

 

ముద్ర, శేరిలింగంపల్లి :

కుటుంబ పార్టీలకు చరమగీతం పాడుతూ, అంచెలంచెలుగా ఎదిగిన ఏకైక కార్యకర్తల పార్టీ బీజేపీ, అభివృధి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలే మనకి మార్గదర్శకం అని బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన భాజపా శిక్షణా తరగతుల కార్యక్రమంలో లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకం, నాయకులుగా ఎదగాలంటే సరైన శిక్షణ చాలా అవసరమన్నారు.
భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా మాతృ శ్రీ నగర్ లో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మాహాభియన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, దేశ చరిత్ర, నాయకత్వ లక్షణాలు, మరియు సమాజ సేవలో ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవచ్చని, మంచి నాయకుడిగా కావాలంటే సరైన శిక్షణ కూడా అవసరమని సూచించారు, బీజేపీ సిద్ధాంతం ఎప్పుడూ ఒక్కటేనని, దేశమంతా ఒక్కటిగా ఉండాలి, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, సంక్షేమం చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ అందాలి, మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటమని తెలుపుతూ ఈ సిద్ధాంతాలతో దేశం లోనే అతి పెద్ద పార్టీ గా అవతరించిందని, దీనికి కారణం కార్యకర్తలు మాత్రమేనన్నారు. కార్యకర్తలు ఆధారంగా ఇక్కడ పని జరుగుతుందని, నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజాభివృద్ధి కోసం కృషి చేసే నిబద్ధత గల కార్యకర్తలు బిజెపి సొంతమని కొనియాడారు. మన పార్టీ స్లోగన్ ఎప్పుడూ ఒక్కటేనని నేషన్ ఫస్ట్ , పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని, అధికారంలోకి రావడం ఎంతో మంది సీనియర్ నాయకులు, కార్యకర్తల కల అని, దాని కోసం మనమంత కలిసి పని చేస్తే, తెలంగాణలో బిజెపి రావడం పక్కా అని, అందులో మన శేరిలింగంపల్లి కార్యకర్తల కృషి కూడా ఉండాలన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మనీపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు, రేపు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో మనం క్రమశిక్షణగా సిద్ధాంతాన్ని నేర్చుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి, అశోక్ కురుమ, అనిల్ గౌడ్, మాణిక్ రావు, దుర్గారావు, కృష్ణంరాజు, స్రవంతి , పద్మ, బుచ్చిరెడ్డి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.