Take a fresh look at your lifestyle.

వృద్ధుల ఫిర్యాదులపై ఆర్డీవో కార్యాలయంలో విచారణలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వయో వృద్ధులను నిరాదరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఆర్డీవో అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏ.ఓ.రవికాంత్ విచారణలు నిర్వహించారు.గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన సింగం లక్ష్మీ,అదే మండలంకు చెందిన నందిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల రామవ్వ,జగిత్యాల పట్టణములోని వంజరివాడకు చెందిన తుదుగేని శారద, మంచినీళ్ల బావి వాడ కు చెందిన రాయిల్ల మల్లయ్యల తదితర ,వివిధ మండలాల గ్రామాల ఫిర్యాదు దారుల కుమారులను, కూతుర్లను, కోడళ్లను, అల్లుళ్ళను, మనుమలను, మనుమ రాళ్లను విచారించారు. విచారణలకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులకు, కోడళ్లకు, కూతుర్లకు, అల్లుళ్ళకు 2007 సంరక్షణ చట్టం, నియమావళి 2011, సెక్షన్ 24 పై సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ చేశారు. ఆ తల్లిదండ్రుల పక్షాన సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ వాదనలు వినిపిస్తూ వారికి వృద్ధుల సంరక్షణ చట్టం కింద న్యాయం చేయాలని కోరారు. జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండిగే లక్ష్మీ అనే వృద్ధ తల్లిని, తండ్రి బాలమల్లును పోషించకుండా కొడుతూ, చంపుతనని బెదిరింపులకి గురిచేస్తున్న వారి పెద్ద కొడుకు పై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 24 ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 340/2024 తేదీ.29-7-2024 ద్వారా క్రిమినల్ కేసు నమోదు అయిందని, అలాగే జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డివిజన్లలో కుమారులకు6 మాసాల జైలు శిక్షతో పాటు జరిమాన ఆర్డీవో లు విధించిన విషయాన్ని వివరిస్తూ హరి ఆశోక్ కుమార్ ఆ కొడుకులకు, కోడళ్లకు, కూతుర్లకు, మనుమలకు కౌన్సి లింగ్ నిర్వహించారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపర చర్యలు ఉంటాయని ఏ.ఓ.రవికాంత్ హెచ్చరించారు.ఈ విచారణలో తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, వృద్ధుల సంరక్షణ విభాగం సహాయకురాలు పద్మజ, తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.