- ఎమ్మెల్సీ ఎల్ రమణ.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడమే ఎల్ జీ రామ్ హెల్త్ కేర్ లక్ష్యం మని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. ఎల్ జి రాం హెల్త్ కేర్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల మండలంలోని కండ్లపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థులకు డెంటల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ పల్లె, పట్టణ నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని నేపథ్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లలకు,విద్యార్థులకు ఆరోగ్యం పైన దృష్టి పెంచుకోవాలని సదుద్దేశంతో ఆరోగ్యవంతమైన దంతాలు మీద అవగాహనపై దంత వైద్య నిపుణులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఉపాధ్యాయులు విద్యను ఏ విధంగా అందిస్తారో అలాగే వైద్యులు వైద్యాన్ని, మన ఆరోగ్య జీవన శైలిని జీవన విధాన్ని మార్చుకునేందుకు సహకరిస్తారన్నారు.మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి దంతాలు, కండ్లు, వాటిని సున్నితంగా జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులు ఉదయం లేవగానే చక్కగా బ్రష్ చేసుకుని పద్ధతిగా దంతాలను శుభ్రపరచుకోవాలని దంతాలు సరైన పద్ధతిలో శుభ్రపరచుకోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.800 మంది విద్యార్థులకు టూత్ బ్రష్, పేస్టు, టంగ్ క్లీనర్ అందించి పండ్ల పంపిణీ చేశారు.డాక్టర్ల బృందం పిల్లలందరికీ దంతాల సమస్యల గురించి స్క్రీనింగ్ చేస్తూ వాటికనుగుణంగా మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డి రాము, ఎం ఇ ఓ గాయత్రి, సివిల్ హాస్పిటల్ ఆర్ యం ఓ సుమన్ మోహన్ రావు, శ్రీపతి, సెక్ట్రోరియల్ అధికారి రాజేశ్, ప్రిన్సిపల్ సరితదేవి, వైస్ ప్రిన్సిపాల్ నాగేష్, డాక్టర్ యస్.కల్యాణ్ కుమార్, డాక్టర్ టి.అమిత రెడ్డి, డా.ఎల్ .వైజయంతి, డా.యన్.లావణ్య,డా.ఎల్ మణికంఠ,ఎల్ శ్రీనివాస్,ఎల్ కార్తికేయ, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి ఆయిల్నేని సాగర్ రావు, కండ్లపెల్లి మాజీ సర్పంచ్ చందా శేఖర్ రావు,వొళ్ళేం మల్లేశం, వొళ్ళాల గంగాధర్, దయ్యాల మల్లారెడ్డి కోరుకంటి రాము, కుడిక్యాల సర్వేశ్వర్, గంగిపెల్లి వేణు మాధవ్, కునమల్ల రాజం, గంగిపెల్లి శేకర్, పెండం గంగాధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
