Take a fresh look at your lifestyle.

ఇబ్రహీంపట్నంలో అమానుష ఘటన

  • చాక్లెట్ తిన్నాడని విద్యార్థిని చితకబాది.. నిర్బంధించిన మెగా మార్ట్ యాజమాన్యం.
  • పట్నం పీఎస్ లో ఐదుగురిపై కేసు నమోదు.

ముద్ర, ఇబ్రహీంపట్నం: చాక్లెట్ తిన్నాడన్న నెపంతో విద్యార్థిని చితకబాది ప్రైవేట్ సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్బంధించిన అమానుష ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం సీఐ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం..నోముల బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శివ అనే విద్యార్థి హాస్టల్ నుండి తప్పించుకుని ఇబ్రహీంపట్నం మంచాల రోడ్ లో ఉన్న మెగా డీమార్ట్ లో డబ్బులు చెల్లించకుండా చాక్లెట్ తిన్నాడు. సీసీ టీవీలో చాక్లెట్ తిన్నాడని గమనించిన మెగా డీమార్ట్ యాజమాన్యం ఆ బాలుడిని దుర్భాషలాడుతూ చితకబాదారు. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు మెగా డిమార్ట్ యాజమాన్యం బాలుడిని ఓ నిర్మానుష్య గదిలో నిర్బంధించారు.హాస్టల్ డిప్యూటీ వార్డెన్ మధు ఫిర్యాదుతో బాలుడిని చిత్ర హింసలకు గురిచేసిన మెగా డీమార్ట్ యజమానులైన ముజాహిద్, బషీర్, చింటూ, షమీర్, రాకేష్ అనే ఐదుగురు వ్యక్తులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అయితే విద్యార్థిని అమానుషంగా కొట్టి, దుర్భాషలాడి, నిర్బంధించిన మెగా డిమార్ట్ ను మూసి వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.