ముద్ర, తెలంగాణ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వేలోని వైద్య విభాగంలో చీఫ్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న పద్మారాణి (59) అస్వస్థతతో రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే పద్మారాణి కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేశారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే పద్మారాణి నేత్రాలను దానం చేసిట్లు ఆమె భర్త రాంబాబు, కుమార్తె రమ్య తెలిపారు. రైల్వే శాఖలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న పద్మారాణి రచయిత్రిగా, కార్డునిస్టుగా మంచి పేరు గడించారు.