Take a fresh look at your lifestyle.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు: ఆర్డీవోకు ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కొడుకులు,కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను సోమవారం రాత్రి ఆశ్రయించింది. ఆయన సాయంతో ఆర్డీవో మధుసూదన్ కు మంగళవారం ఫిర్యాదు చేసింది. కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తున్నా తనకు తిండి పెట్టక కొట్టి ఇంట్లోంచి వెళ్ల గొట్టిన కొడుకులు జగన్,మహేష్,కోడళ్లు గంగ,గౌతమిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, లేని తీరుకు జైలు శిక్ష, జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు కొడుకులు,కోడళ్లపై వయోవృద్ధుల పోషణ,సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి),సెక్షన్ 4(1),సెక్షన్ 24 ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారిని ఆదేశించారు. ఆ వృద్ద్దురాలి వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కౌన్సెలింగ్ అధికారి పి.సి.హన్మంత రెడ్డి , ప్రతినిధులు వెల్ముల ప్రకాష్ రావు, దిండిగాల విఠల్ , సత్యనారాయణ, తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.