Take a fresh look at your lifestyle.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్

  • టెండర్ పూర్తి చేసుకున్న పనులను గ్రౌడింగ్ చేయండి
  • ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అన్ని పనులు వెంటనే గ్రౌండింగ్ చేయాలని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశించారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళ వారం ప్రదాన రహదారి డివైడర్ లో మొక్కలు నాటిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కమిషనర్ (ఎఫ్ ఎ సి) జె.అరుణ శ్రీ తో సమావేశం అయ్యారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రానున్న దృష్ట్యా కోడ్ కంటే ముందే శంఖుస్థాపన చేసుకున్న అన్ని పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పని చేయాలని అన్నారు.ఏక కాలంలో వివిధ చోట్ల జరుగుతున్న అభివృద్ది పనులు పర్యవేక్షించేందుకు ఇంజనీరింగ్ అధికారులు వేర్వేరు బృందాలుగా వెళ్లాలని అన్నారు.డివిజన్ లోని చిన్న చిన్న వీధులలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అన్నారు.కొత్తగా రామగుండం నగర పాలక సంస్థలో విలీనమైన లింగాపూర్ వైపు పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నoదున అన్ని రకాల మౌళిక వసతుల కల్పించడానికి సన్నాహాలు చేయాలని అన్నారు. రాజీవ్ రహదారితో పాటు నగరం లో అన్ని వీధి దీపాలువెలిగేందుకు నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు.ఆర్ అండ్ బి తో పాటు ఇతర విభాగాలు చేపడుతున్న పనులను కూడా త్వరితగతిన నాణ్యతతో పూర్తయ్యేలా నగర పాలక సంస్థ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.వన మహోత్సవం లో నాటిన అన్ని మొక్కలు సజావుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.