Take a fresh look at your lifestyle.

భువనగిరి చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 32వ అఖండ జ్యోతి యాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకై స్వామివారి 32వ అఖండ జ్యోతి యాత్ర మంగళవారం రాత్రి  భువనగిరి చేరుకుంది. డాల్ఫిన్ హోటల్ వద్ద భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ ఛైర్పర్సన్ మంజుల వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. గత 32 సంవత్సరాలుగా రథయాత్ర భువనగిరి నుండి వెళ్తూ భువనగిరి పట్టణ ప్రజలను ఆశీర్వదిస్తున్న ప్రాంత ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అని, స్వామివారి ఆశీర్వాదం పట్టణ ప్రజలకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖండ జ్యోతి యాత్ర ప్రధాన చైర్మెన్ సద్ది వెంకట్ రెడ్డి, సహా చైర్మన్ డాక్టర్ బుచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దిడ్డి బాలాజీ, పట్టణ చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి, ప్రజా సంబంధాల కన్వీనర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్, దేవరకొండ నరసింహాచారి, ఎన్విడి నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ అఫ్ భువనగిరి అధ్యక్షులు పలుగుల ఆగేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ సుమంత్ రెడ్డి, వాసవి క్లబ్ అధ్యక్షులు బిజ్జల మహేష్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పాదరాజు శ్యామ్ మోహన్ రావు, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు ఇటిక్యాల లావణ్య, రెడ్ క్రాస్ ప్రతినిధులు చంద్రశేఖర్, చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీ పెరంబుదూరు స్పందన, నాయకులు రత్నపురం శ్రీశైలం, బెండే లాల్ రాజ్, చల్లగురువుల రఘుబాబు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.