Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్ల పూజలో పాల్గొన్న పీసీసీ డెలిగేట్ రవికుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పట్టణంలోని 35వ వార్డు ఆర్ బి నగర్ లో లబ్ధిదారులైన, మాటూరి రేణుక, పిట్టల శ్రావణిల ఇందిరమ్మ ఇండ్ల  పూజ  కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం  పేదలకు లబ్ధి చేకూరుస్తుందని ప్రజాపాలనలో భాగంగా  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి జాంగిర్, మాటూరి కృష్ణ, పిట్టల నరసింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్, 35 వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.