Take a fresh look at your lifestyle.

జోగిపేట వాసికి జీవనాధారంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట ముద్ర,ఫిబ్రవరి 23

:ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం అన్న సంకల్పాన్ని మరోసారి కార్యరూపంలో చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట వాసికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్‌ను అందజేశారు.జోగిపేట 16వ వార్డుకు చెందిన గంజి మల్లేశం దీర్ఘకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మంత్రి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు.ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసి, ప్రతినెలా రూ.10 వేల వ్యయంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్,బైప్యాప్ మెషిన్ అద్దెకు తీసుకుంటున్న కుటుంబానికి మంత్రి అండగా నిలిచారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా గంజి మల్లేశం కుటుంబ సభ్యులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, బైప్యాప్ మెషిన్‌ను అందజేశారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ చర్య మరోసారి స్పష్టం చేస్తుంది.ఈ సందర్భంగా మల్లేశం కుటుంబ సభ్యులు మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.