Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాలు కార్యక్రమాలను కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ కె. రామకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా వారోత్సవాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, కళాశాల ప్రవేశాల కోసం సమాచార బ్రోచర్లు, ఫ్లెక్సీలను అధ్యాపక బృందం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెంపొందించడం, విద్యార్థుల్లో ఉన్నత విద్యపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం, సమాజంలో విద్యా చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు తెలిపారు. వారం రోజుల కార్యాచరణలో భాగంగా మంగళ వారం పీజీ ప్రవేశ కోచింగ్ ప్రారంభోత్సవం, యోగా – ధ్యాన శిబిరాలు, విద్యార్థుల నమోదు పెంపు కార్యక్రమాలు, మెగా పేరెంట్ – టీచర్ సమావేశాలు, రక్తదాన శిబిరాలు, గ్రంథాలయ దినోత్సవం, పుస్తక ప్రదర్శనలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, కళాశాల మౌలిక సదుపాయాల సందర్శన, కృత్రిమ మేధస్సుపై సదస్సులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు – క్రీడాకారుల సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 13న నియోజకవర్గ స్థాయిలో విద్యార్థుల నమోదు, విద్యలోకి యువతను తీసుకురావడంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. మే 16న జిల్లా స్థాయిలో జేఎన్టీయూ, పీయూ, ఎస్‌యూ, కేయూ విశ్వవిద్యాలయాల్లో ఏఐ కాన్‌క్లేవ్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్‌గా జి. చంద్రయ్య వ్యవహరించగా కార్యక్రమాల అమలులో ప్రొఫెసర్ టి. ప్రమోద్ కుమార్, ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్, ఎన్.వాసవి, జి. శ్రీలత, డి. సుజాత, ఎన్. సంగీత రాణి, మల్లికార్జున్, జి. నీరజ, వి. జమున, కె. రామచంద్రం, శ్రీ సత్యం, సునీత, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.