Take a fresh look at your lifestyle.

చలివేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని శనివారం రోజు నేరడిగుంట ఎక్స్ రోడ్డులో చలివేంద్రాన్ని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నేరడిగుంట ఎక్స్ రోడ్ నిత్యం రద్దీగా ఉండటం చుట్టూ పది గ్రామాల ప్రజలు వ్యాపార నిమిత్తం వస్తుంటారు.ఎండలు బాగా కొడుతుండటంతో సామాన్య ప్రజలు బాటిల్ వాటర్ ఇరవై రూపాయలు కొనలేక దాహంతో ఉండకూడదు అనే సంకల్పంతో చలి వేంద్రం ఏర్పాటు చేసి మట్టుకుండలో మినరల్ వాటర్ అందజేస్తున్నామని నేతాజీ యువజన సంఘం నాయకులు తెలిపారు.ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చిన నేతాజీ యువజన సంఘ సభ్యులను చుట్టూ పక్కల ప్రజలు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.