Take a fresh look at your lifestyle.

విద్యుత్ కెపాసిటి 25 హెచ్ పీ పెంచినందుకు ఎమ్మెల్యేను సన్మానించిన విశ్వకర్మలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వకర్మలకు విద్యుత్ కెపాసిటి 25 హెచ్ పీ పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు.విశ్వకర్మలకు కుటీర పరిశ్రమల కింద గుర్తించి దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 10 హెచ్ పీ కరెంట్ కనెక్షన్ ఇవ్వగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా నూతన పరికరాలు రావడంతో 10 హెచ్ పీ కరెంటు సరిపోకపోవడంతో గత ప్రభుత్వంతో ఎన్నో మార్లు వినతి పత్రాలు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం అమలు పరచలేదు.ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వకర్మను గుర్తించి 25 హెచ్ పీ వరకు కెపాసిటీ గల విద్యుత్ వాడుకునే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలుపుతూ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కు సన్మానం చేసి తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్, ఉపాధ్యక్షులు గాజోజు సంతోష్ కుమార్, పొన్నగంటి రంజిత్ సహ కార్యదర్శి శివనూరు రాకేష్, యూత్ కన్వీనర్ కోరుగంటి సాయికృష్ణ,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.