ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్.
ముద్ర, తాండూర్: తాండూర్ ప్రాంత అభివృద్ధి కొరకు తమ వంతు తోడ్పాటు అందించాలని ఆర్ బి ఎల్ సీఈవో బియ్యని శ్రీనివాస్ రెడ్డి ని కోరారు. బుధవారం రోజున మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. నూతన ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్, పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్ మరియు నూతన కౌన్సిలర్లుగా గెలుపొందిన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఆశీర్వదించరని, వారి ఆశలను వమ్ము చేయకుండా వార్డు సమస్యలను పరిష్కరించాలని, అందులో నా వంతు సహకారం ఎల్లప్పుడూ తప్పక ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిఎల్ఎండి బుయ్యని సరళ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, పార్టీ నాయకులు అబ్దుల్ రహుఫ్, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.