కోరుట్ల, ముద్ర విలేకరి: సిరికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వారికి వైద్య పరీక్షలను ఆర్.బి.ఎస్.కే వైద్యాధికారి డాక్టర్ సురేందర్, తబస్సం సమర్ధంగా నిర్వహించారు. కెజిబివి, కథలాపూర్ జెడ్పిహెచ్ఎస్ లోపని చేస్తున్న కార్మికులకు రక్తపరీక్షలు, బీపీ, షుగర్ తదితర ఆరోగ్యపరీక్షలు చేశారు.కార్మికులు ఈ సేవను సద్వినియోగం చేసుకొని వైద్యుల మార్గదర్శకాలను పాటిస్తూ, తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించవలసిన అవసరం ఉందని, ఆరోగ్యమే మహాభాగ్యo అనే మాటను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ వనతడుపుల రవికుమార్, ఉపాధ్యాయులు అశోక్, చంద్రశేఖర రావు, అనిత, విజయ, కవిత, శ్రీనివాస్, చురుకుగా పాల్గొన్నారు.