Take a fresh look at your lifestyle.

“పెదేళ్లు సంక్షేమం,అభివృద్ధిలో బీఆర్ఎస్ నెంబర్ వన్”

  • చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.

రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఆనాటి (టిఆర్ఎస్) బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పదేళ్లలో సంక్షేమం,అభివృద్ధితో పాటు వివిధ రంగాల్లో బహుముఖంగా తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలో పండుగల నిర్వహించారు.ముందుగా జయశంకర్ చౌరస్తా వద్ద జయశంకర్ విగ్రహానికి,తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేశారు. స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.అంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడరు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చెన్నూరు నియోజకవర్గంలో తెచ్చిన ఎస్.డి.ఎఫ్,సి.డి.పి,డి. ఎం.ఎఫ్.టి నిధులను కొంత మార్చి కొత్త పనులుగా చూపిస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారని గుర్తు చేశారు.అలాగే మందమర్రి,రామకృష్ణాపూర్ ప్రాంతాలలో నిర్మించిన రెండు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు,చెన్నూరులో సబ్ స్టేషన్ రిబ్బన్ కట్ చేసి పనులు చేసినట్లు చెప్పుకుంటున్నారే తప్ప సంవత్సరంనర కాలంలో కొత్తగా చెన్నూరు నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదన్నారు. ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రాంత నిరుద్యోగులకు ఇచ్చిన నలభై ఐదు వేల ఉద్యోగాల ఊసే లేదన్నారు. జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి నివాస ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న ప్రజలకు నలభై వేల ఇండ్ల పట్టాలను అందించామన్నారు.ఇంకా పెండింగ్లో ఉన్న పట్టాలను ఇప్పించలేక పోతున్నారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జి రాజా రమేష్,పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ వార్డు కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదేలు,జిలకర మహేష్,అలుగల సత్తయ్య, పారిపెళ్లి తిరుపతి,గడ్డం రాజు,అనిల్ రావు,యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.