Take a fresh look at your lifestyle.

ముద్ర’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ 

  • ముద్ర మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన మంత్రి

ముద్ర, సూర్యాపేట: ముద్ర దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కల్లూరు గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలలో పాల్గొన్న ఉత్తంకుమార్ రెడ్డి ముద్ర దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కొంజేటి సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాలనలో జరగని అభివృద్ధి నేడు జరుగుతున్నదని చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద 12 వేల రూపాయలు అందిస్తామన్నారు. రేషన్ కార్డు లేని వారికి త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, అదేవిధంగా పాత రేషన్ కార్డుల్లో పేరు నమోదు కాని వారి పేరును కూడా చేర్చుతామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులమంతా నిర్విరామంగా పని చేస్తున్నామని, అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని ఆన్నారు. త్వరలో ఇవ్వబోయే ఇందిరమ్మ ఇల్లు కల్లూరు లోనే ఎక్కువగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత 40 సంవత్సరాలలో లాల్ లక్ష్మీపురానికి రోడ్డు లేదని, ఆ రోడ్డు పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. 

సీనియర్ జర్నలిస్టుల సారథ్యంలో నడుస్తున్న ముద్ర దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముద్ర పత్రిక తనదైన శైలిలో ప్రజా సమస్యలను వెలుగు లోకి తెస్తూ , అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందడానికి చేరవేయడంలో ప్రజలకు ప్రభుత్వానికి సారధిగా పనిచేయడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో ఈ పత్రిక విలువలతో కూడిన సమాచారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో చలసాని ఫౌండేషన్ అధినేత చలసాని రాజీవ్, నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి, నల్గొండ డిసిసి శంకర్ నాయక్, సూర్యాపేట జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, వైస్ చైర్మన్ అలక సరిత సైదిరెడ్డి, మోతిలాల్, కొంజేటి కిరణ్, కొంజేటి కిషోర్, చలసాని శాలిని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.