- ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : అగ్రికల్చర్ కాలేజీ తరలిస్తే ఊరుకునేది లేదని, తరలిస్తే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర్ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడుతూ గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ధర్మపురి మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో 75 ఎకరాలు అగ్రికల్చరల్ కాలేజీకి కేటాయించడం జరిగిందని. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ధర్మపురి నియోజకవర్గానికి కేటాయించిన అగ్రికల్చర్ కాలేజీని మానకొండూరు నియోజవర్గానికి తరలించే ప్రయత్నం చేస్తుందన్నారు.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని స్తంభంపల్లికి కేటాయించిన కాలేజీకి బడ్జెట్ కేటాయించి, కాలేజీ నిర్మాణం కోసం ముందడుగు వెయ్యాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ కాలేజీ తరలిస్తే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ విష్ణు, సాయికిరణ్, సర్వేష్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.