Take a fresh look at your lifestyle.

యూనివర్సిటీ భూములపైన రాజకీయమా?

  • రేవంత్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.
  •  దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒకటి.
  • పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరి నిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో  యూనివర్సిటీదే అగ్రస్థానం.
  • ఈ భూములను కాపాడుకోలేకపోతే  ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టమైతది.
  •  ఈ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.
  • ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ భూములను అఘమేఘాలపై విక్రయించాల్సిన అవరసర ఏముందని  ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా  కొనసాగుతోందన్నారు. అలాంటి యూనివర్సిటీ భూములపై దుర్మార్గుడై రేవంత్ కన్ను పడిందని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఎదురించి భూములను కాపాడుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు  ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఆందోళనలు చేపట్టినా..అందులో తమ పార్టీ ముందు వరసలో ఉంటుందని విద్యార్ధులను ఆయన భరోసా ిచ్చారు.సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కేటీఆర్ ని తెలంగాణ భవన్ లో కలిశారు. వారి పోరాటానికి అండగా ఉంటామని తెలిపిన కేటీఆర్, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని అన్నారు. అందుకే తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారన్నారు. అలాంటి యూనివర్సిటీ భూములను ప్రభుత్వ పరం రాకుండా  విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న పోరాటం చాలా గొప్పదన్నారు.  విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం పడుతున్న ఆరాటం చాలా గొప్పదని ప్రశంసించారు.ఈ ధ్య కొత్త తరం పిల్లల్లో విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడతాం..కానీ ఇలాంటి సరైన సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను, చంపిమరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరి నిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలేనని అన్నారు. ఈ భూములను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్సిటీకి చెందిన  400 ఎకరాలను అమ్మేముందు జరిగే పర్యావరణ నష్టం ప్రభావం పైన అధ్యయనం చేయాలని విద్యార్ధులు  అడుగుతున్నారన్నారు. కనీసం దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు  అంగీకరించడం లేదని ప్రశ్నించారు. 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం  అప్పటి ప్రభుత్వం  400 ఎకరాలను కేటాయించిందన్నారు. కేవలం స్టేడియాలు క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు భూములను ఆ సంస్థకు ఇచ్చిందని గుర్తు చేశారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఈ భూములను కాపాడుకునేందుకు విద్యార్ధులు రాత్రింభవళ్లు ఆందోళనలు చేస్తుంటే..ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.అక్కడ బుల్డోజర్లు చేస్తున్న కార్యక్రమాలకు  వన్యప్రాణులు కాపాడాలని అరుస్తున్న రోదనల విజువల్స్ కనిపించడం లేదా నిలదీశారు.హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపైన పర్యావరణహితం కోసం ప్రజా ప్రయోజన రాజ్యం వేయడం జరిగిందన్నారు.గతంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లారని..అలాంటి విద్యార్థులపైన ఇన్ని అరాచకాలు జరుగుతున్న పర్యావరణంపైన ఇంత అక్రమంగా తమ సొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇదే రాహుల్ గాంధీ గతంలో ముంబై ఆరాయి అడవులపైన జాతీయస్థాయిలో మాట్లాడారన్నారు.కానీ ఇదే రాహుల్ గాంధీ   హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ అడిగారు. ఈ విషయంలో విద్యార్ధులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు.విద్యార్థుల ఆందోళనలపై సరైన వేదికలపైన పార్టీ పక్షాన లేవనెత్తుతామన్నారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు స్మశానాలకు కూడా జాగాలు ఉండవు అంటూ చెప్పింది రేవంత్..ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడన్నారు. పిల్లలు ఇద్దరు యూనివర్సిటీ పిల్లలను అరెస్టు చేశారని..వారి  ఆచూకీని వెంటనే రాష్ట్రప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.