ముద్ర, బోడుప్పల్:
నగరాన్ని పరిశుభ్రంగా వుంచడంలో మహిళా పారిశుధ్య కార్మికుల శ్రమ అనిర్వచనీయమని మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ అన్నారు. ఆమె ఆదేశాల మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ 10వ సర్కిల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శానిటేషన్ మహిళా కార్మికులను సన్మానిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం చేసి అభినందనలు తెలిపారు. నగర పరిశుభ్రత కోసం వారు చేస్తున్న కృషిని అధికారులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఈ. శ్యామ్ సుందర్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌డబ్ల్యూఎమ్) కె. జాహ్నవి శశాంక్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎస్‌డబ్ల్యూఎమ్), శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ మహిళా శానిటేషన్ కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారి కృషిని గౌరవించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమని పేర్కొన్నారు.