Take a fresh look at your lifestyle.

దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

  • కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్తాం.
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా.
  • తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు వెళ్తున్నాయి.
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్ పార్టీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పార్టీ అవినీతి ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతమైందని ఆయన విమర్శించారు. ఈమేరకు ఆదివారం నాంప్లలి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు వర్క్‌షాప్ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పదకొండేళ్ళ పాలన, అంతర్జాతీయ యోగాదినోత్సవంను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం, రాష్ట్రంలో అకాల వర్షాలతో సంభవించిన పంటల నష్టం, వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తోన్న సాయం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రధాని మోడీ పదకొండేళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించాలని పదాధికారులకు సూచించారు.యోగా దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున ఈనెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని మండలాలు, జిల్లాలో పదేళ్ల యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈనెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సుపరిపాలన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. జిల్లా, మండల అధ్యక్షుల చేత నిర్వహించే ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ ఒకరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణను అప్పుల ఊబిలో ముంచేశాయని ఆయన ధ్వజమెత్తారు.తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీ అధికారంలోకి రావల్సిన అసరం ఎంతైనా ఉందని, ఈ దిశగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి వేగంగా పుంజుకుంటుందని తెలిపారు.తెలంగాణను బీజేపీ తప్ప ఏ పార్టీ కాపాడలేదని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్​ గాంధీకి దేశ భవిష్యత్​, వాస్తవ పరిస్థితులు తెలియదన్నారు. ఎవరో రాసిన స్పీచ్​ ను చదివి వినిపిస్తారని కిషన్​ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కూడా బీజేపీని విమర్శిస్తున్న వారు 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఆధునీకరిస్తున్నామని తెలుసుకోవాలని అన్నారు. ఇందిరాపార్కులో కాంగ్రెస్​ హయాంలో నాచారం, కూకట్​ పల్లి, పఠాన్​ చెరువు ఇండస్ట్రీయల్ ​ ఎస్టేట్​ లో పారిశ్రామిక వేత్తలు వచ్చి ధర్నాలు చేసేవారన్నారు. ఏ ఒక్క రంగానికి విద్యుత్​ కొరత లేకుండా ప్రధాని మోదీ ఆవిష్కృతం చేశారని కిషన్​ రెడ్డి చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఎరువుల కోసం క్యూలో ఉన్న చరిత్ర కాంగ్రెస్​ పార్టీ హయాంలో ఉండేదన్నారు. ప్రస్తుతం ఎరువుల కొరత లేదన్నారు. ఒక్క రూపాయి పెంచకుండా, లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. రక్షణ రంగంలో దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి ఎదిగామన్నారు. పేదప్రజలకు బియ్యం, గ్యాస్​ సిలీండర్​, గృహాలు, నీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆయుష్మాన్​ భారత్​, 70ఏళ్లు దాటిన వారికి కూడా వైద్యం అందే ఏర్పాటు చేశారన్నారు.

Leave A Reply

Your email address will not be published.