- పలువురికి గాయాలు
- రిమ్స్ కు తరలింపు !
ముద్ర విలేకరి, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ అడవి ప్రాంతంలో పోలీసుల, అటవీ శాఖ ఉద్యోగులపై ముల్తానీలు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిచెల్మ అడవులోనీ పోడు భూముల సాగుచేస్తున్న భూమూలో ప్లాటీషన్ చేయటానికి అటవీ శాఖ ఉద్యోగులు పోలీస్ బందోబస్తు తో ఆదివారం రోజున వెళ్లారు. పోడు భూములలో ప్లాంటేషన్ను చేయడాన్ని ముల్తాన్లు అడ్డుకున్నారు దీంతో ప్లాంటేషన్ చేయడానికి ముందుకు వెళ్లిన పోలీసులు ఉద్యోగులపై ఒకేసారి ముల్తాన్లు రాళ్లతో దాడులు చేయడంతో పలువురికి గాయపడ్డారు దీంతో పోలీలు, విశాఖ అధికారులు వెనుతిరిగి వచ్చారు గాయపడ్డ వారిని కొందరిని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించగా, ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది ఇది ఇలా ఉండగా ప్లాంటేషన్ పోడు భూములు చేయడానికి అధికారులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని, రాస్తా రోకో చేయడంతో వెనుతిరిగి వచ్చారు. మళ్లీ ఆదివారం రోజున పోలీసు బందోబస్తు తో వెళ్లి, పోడు భూములలో ప్లాటీషన్ చేయడానికి వెళ్లిన ఉద్యోగులకు ఊహించిన విధంగా ఎదురు దెబ్బ తగిలింది.ఏది ఏమైనా ప్లాంటేషన్ పోడు భూములలో ప్లాంటేషన్ చేయటానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నించడం అడ్డుకోవడం వల్ల కవ్వాల్ అడవి ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.