Take a fresh look at your lifestyle.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు మానవాళికి దిక్సూచి: సీఎం చంద్రబాబు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీ శ్రీ రవిశంకర్ బోధనలు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. గురూజీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మాట్లాడిన సీఎం, తాను కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా భారతీయుడిగా, గురూజీ బోధనలను అనుసరించే వ్యక్తిగా హాజరయ్యానని అన్నారు.

శ్రీశ్రీ రవిశంకర్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలిచిన ప్రపంచ మానవుడని కొనియాడారు. “హింసలేని సమాజం – ఒత్తిడి లేని మనుషులు” అనే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గత 45 ఏళ్లుగా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తోందన్నారు. గ్రామాల నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల వరకూ సంభాషణల ద్వారా శాంతి సాధనకు గురూజీ చేసిన కృషి విశేషమని తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇంధన వనరుల సమస్యలతో ప్రజల జీవితాలు ఒత్తిడికి లోనవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు మానవాళికి మరింత సేవ చేయాలని కోరారు. ప్రధాని Narendra Modi నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, స్పేస్, డ్రోన్, డేటా సెంటర్ ప్రాజెక్టులు, క్వాంటం కంప్యూటర్ వంటి ఆధునిక సాంకేతిక ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అయితే అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి శాంతి, ఆనందం కలగాలని తాను కోరుకుంటున్నానన్నారు.

“హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ” లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలు చేస్తున్నామని, ప్రతి పౌరుడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఏపీలో మరింతగా పనిచేయాలని ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.