Take a fresh look at your lifestyle.

మహిళా సంఘం ప్రమాద బీమా చెక్కు అందించిన ఎమ్మెల్యే

మల్యాల,ముద్ర విలేఖరి: మహిళా సంఘం ద్వారా ప్రమాద భీమా అందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం మండల కేంద్రానికి చెందిన ఆగంతపు రాజకుమారి ఉషోదయ మండల సమైక్య వాయుపుత్ర గ్రామ సంఘంలో శివ సాయి ఎస్ హెచ్ జి లో సభ్యురాలుగా ఉంది. ఆమె ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మహిళ సంఘం ద్వారా తీసుకున్న రుణానికి ప్రమాద బీమా మంజూరు కావడంతో రూ”10 లక్షల బీమా సొమ్ము ను ఎమ్మెల్యే చేతుల మీదుగా నామినికి అందించారు. తీసుకున్న రుణం మొత్తం మాఫీ అవుతుందని తెలిపారు. ప్రమాద, లోన్‌ బీమాలు తమకు ఎంతగానో భరోసా కల్పిస్తున్నాయని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో దొంగ ఆనంద రెడ్డి, బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్, దారం ఆదిరెడ్డి, ముత్యం శంకర్, శనిగారపు తిరుపతి, నాగులపేట సంజీవ్, కొండబత్తిని అనిల్, నేరెళ్ల సతీష్ రెడ్డి, మ్యాక లక్ష్మణ్, కట్కం వినయ్, నక్క అనిల్, కట్కూరి ప్రశాంత్, కోరెపు వెంకటేష్, బండి రవి, దూడం రామాంజనేయులు, కంటే అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.