ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్, ఎం.ఏ రహీం అంజుమన్ ఇస్లాఉల్ ముస్లిమీన్ అధ్యక్షులు అన్నారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు యుద్ధం వద్దు శాంతి కావాలి అని నినాదంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. యుద్ధం వల్ల అన్ని దేశాలపై ధరల ప్రభావం పడుతుందని చమురు ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై భారాలు పడతాయన్నారు. అమెరికా చేస్తున్న యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని అమెరికా సామ్రాజ్యవాదం దేశం మీద మరింత పెరుగుతుందని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీ లాంటి సంస్థలకు రాయితీలను కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నిరుగార్చుతూ నిరుద్యోగాన్ని పెంచుతూ, రైతాంగాన్ని దివాలా తీస్తూ పరిపాలన సాగిస్తున్నాడని, అమెరికా భారతదేశం మీద అనేక విధాలుగా సుంకాల పేరుతో పన్నులు పెంచుతున్న కనీసం నోరు మెదపకుండా ఉన్నాడని, రష్యా నుండి చమురు కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధిస్తున్న మోడీ ప్రభుత్వం ఎలాంటి ఖండన ఇవ్వకపోవడం విడ్డూరమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శేక్.హమీద్ పాష, సామాజిక చైతన్య సమితి అధ్యక్షులు, శ్రీనివాసాచార్యులు, సామ మల్లారెడ్డి, చిన్నయ్య, జిట్టా భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల బాలరాజు, సిపిఎం పార్టీ నాయకులు కల్లూరి మల్లేశం, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు చెన్నా మహేష్ స్వాతి, నాకోటి నగేష్, చీమల రాజు,ఏలే భువనేశ్వరి శివ, ప్రజా సంఘాల నాయకులు, యస్.ఎఫ్.ఐ నాయకులు లావుడియా రాజు పాల్గొన్నారు.