Take a fresh look at your lifestyle.

గోశాలను ఇతర ప్రదేశాల్లోకి తరలించండి

  • ఈ విషయంపై త్వరలో ముఖ్యమంత్రికి విన్నవించడం జరుగుతుంది.
  • చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
  • ఎన్కేపల్లి భూ బాదితులకు అండగా ఉంటామని భరోసానిచ్చిన ఎంపీ.

మొయినాబాద్, ముద్ర విలేకరి :జిల్లాలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయని అక్కడికి గోశాలను తరలించాలని.. ఎన్కేపల్లిలోనే ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయలనుకుంటుందో అర్థం కావడం లేదని ఇదే విషయంపై త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించడం జరుగుతుందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కోన్నారు. ఎన్కేపల్లిలోని సర్వే నంబర్ 180లోని 99 ఎకరాల 14 గుంటల ప్రభుత్వ స్థలంలో గోశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అక్కడ సాగుచేసుకుంటున్న రైతులు వారం రోజుల నుంచి నిరసనలో కూర్చుకున్నారు. అయితే అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే రత్నం, మండల బీజేపీ అధ్యక్షుడు దారెడ్డి చంద్రశేఖర్రెడ్డి అధ్వర్యంలో ఎన్కేపల్లి రైతులకు బీజేపీ పార్టీ తరపున అండగా నిలుస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో బాగంగా శనివారం సాయంత్రం కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎన్కేపల్లి గోశాల స్థలాన్ని పరిశీలించి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్కేపల్లిలో గోశాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోశాల ఏర్పాటుకు జిల్లాలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని వాటిని కాకుండా ఎన్కేపల్లిలోని సాగు భూములను పేద రైతుల నుంచి లాక్కొవడం సరైనది కాదని అన్నారు. ఎన్కేపల్లి భూ బాదితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తునే ఉంటామని పేర్కొన్నారు. ఇదే విషయంపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పూర్తి వివరాలు వెల్లడించి ఎన్కేపల్లి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని రైతులకు భరోసానిచ్చారు. ఎన్కేపల్లిలోని ప్రభుత్వ స్థలం సాగుకు పనికి వచ్చేదని దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉం చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, సీనియర్ నాయకులు ప్రభాకర్రెడ్డి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు దారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మోర నర్సింహ్మరెడ్డి, ప్రభాకర్ యాదవ్, రైతులు సికిందర్, డప్పు రమేష్, ఈశ్వర్ రైతులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.