Take a fresh look at your lifestyle.

కుష్టు వ్యాధి నిర్మూలన కు సహకరించండి, కోదాడ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఒంటెపాక అమర్ కుమార్

 

ముద్ర నడిగూడెం…..

స్పర్శ్ – లెప్రసీ వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలలో భాగంగా నడిగూడెం మండల కేంద్రంలో ని కస్తూర్భా బాలికల వసతి గృహంలో లెప్రసి వ్యాధి పై ప్రతిజ్ఞ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం కోదాడ డివిజన్ డిప్యూటీ పారామెడికల్ అధికారి ఒంటెపాక అమర్ కుమార్ మాట్లాడుతూ
వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో ప్రతిజ్ఞ ను అన్ని వసతి గృహాలలో, పాఠశాల లో జనవరి 30 2026 నుండి ఫిబ్రవరి 13 2026 వరకు వైద్య ఆరోగ్య శాఖ చే నిర్వహిస్తారని కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, మందమైన మెరిసే జిడ్డు గల చర్మం, చెవులపై ,వీపుపై ,ఎదపై నొప్పిలేని బొడిపెలు, అరచేతులు అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం కాళ్లు చేతులు తిమ్మిర్లు కలిగి ఉండడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశా కార్యకర్తల కు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని వారిని గుర్తించి నిర్ధారణ అనంతరం వారికి ఎం. డి. టి. చికిత్స విధానం ద్వారా వ్యాధిని నయంచేయవచ్చని తెలిపారు. సబ్ యూనిట్ అధికారి సముద్రాల సూరి హెల్త్ అసిస్టెంట్ తొనుకునూరి కృష్ణ మూర్తి, ఎ.ఎన్.ఎం సుజాత,కె. జి. బి. వి ఉపాధ్యాయినులు విజయ, సునీత మౌనిక, అనిత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.