ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : డ్రగ్స్ కు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కల్వకుర్తి డిఎస్పి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని పలు కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం వాటి వల్ల కలిగే అనార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అధిక మంది డ్రగ్స్ కు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరు ఆలోచించి మత్తు బారిన పడకుండా ఉండాలని అన్నారు. మిత్రులతో కలిసి సరదాగా అంటూ తీసుకుని కొన్ని రోజుల తర్వాత దానికి బానిసలుగా మారిపోతున్నారని అన్నారు. చదువులపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఎక్కడైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై మాధవరెడ్డి, శిక్షణ ఎస్ఐ గిరి మనోహర్, ఆయా విద్యాలయాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.