- అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే మల్ రెడ్డి .
ముద్ర, ఇబ్రహీంపట్నం: పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వివిధ శాఖల అధికారులకు సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్, మెట్రో వాటర్ వర్క్స్, సివిల్ సప్లై, ఆర్ డబ్ల్యూఎస్, ఆర్ఎండ్ బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజల నుంచి సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు.వేసవి దృష్ట్యా తాగునీరు సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్ సమస్యలను తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.అంతర్గత మురుగు కాలు వ్యవస్థ, సిసి రోడ్లు పనులను త్వరతగతిన పూర్తి చేసే విధంగా చొరవ చూపాలన్నారు. వివిధ సమస్యలపై అధికారుల నుండి వివరాలు తెలుసుకుని, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు.