వికారాబాద్, ముద్ర : భారతీయ జనతా పార్టీ మోమిన్ పెట్ మండల స్థాయి సమావేశానికి పదాధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆశీస్సు రెడ్డి కోరారు. నేడు బుధవారం నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్ విచ్చేస్తున్నారని తెలిపారు. మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి రోడ్ హాస్టల్ దగ్గర ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నాయకులు, మాజీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్రియాశీల సభ్యులు, ప్రతి విలేజ్ బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, పదాధికారులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.