Take a fresh look at your lifestyle.

గాలికుంటు వ్యాధి రాకుండా పశువులకు టీకాలు వేయించాలి

  • తుంగతుర్తి లో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

తుంగతుర్తి, ముద్ర: రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని తుంగతుర్తి పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్ అన్నారు.మంగళవారం తుంగతుర్తి లో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడారు.గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు.గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వం పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు.తుంగతుర్తి లో బుధవారం రోజున సైతం పశువులకు టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో 328 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశువైద్యాధి కారి డాక్టర్ ఏ నరేష్ ఎల్ ఎస్ ఏ రాజశేఖర్ వి ఏ రవి నాగరాజు బుచ్చిబాబు గోపాల మిత్రులు శ్రీనివాస్ రెడ్డి లింగయ్య శ్రీను పశుమిత్ర గణేష్ లు గ్రామ రైతాంగం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.