ముద్ర : కాప్రా
ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు కాప్రా సర్కిల్ పరిధిలో మెగా ఈ–వెస్ట్ కలెక్షన్ కార్యక్రమం నిర్వహించారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ఆధ్వర్యంలో సైనిక్ పురి వార్డు కార్యాలయం, కాప్రా, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ ,ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్‌లలో మొత్తం ఐదు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 1633 కిలోల ఈ–వెస్ట్ సేకరణ జరిగింది. కలెక్షన్ సెంటర్లలో మాత్రమే కాకుండా వీధుల్లో కూడా ప్రచారం నిర్వహించి, మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణ శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ–వెస్ట్ సేకరించారు.
సేకరించిన ఈ–వెస్ట్ మెటీరియల్‌ను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక చేసిన ఏజెన్సీలకు అప్పగించారు. ప్రతి వస్తువుకు నిర్ణయించిన రేటు ప్రకారం యజమానులకు డబ్బు చెల్లించే విధానం అమలు చేస్తున్నారు. కాప్రా సర్కిల్ ప్రాంతంలో ఆర్ఈసిఓ ఏజెన్సీ ద్వారా ఈ–వెస్ట్ మెటీరియల్‌ను డిస్పోజ్ చేశారు.
ఈ కార్యక్రమం రేపు ఆదివారం కూడా కొనసాగుతుందని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీహరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ సాలిడ్ మేనేజ్మెంట్ రవి, సానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్లు సుధీర్, రామకృష్ణ, శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏలు వసంత లక్ష్మి, సంజీవ్, ఇన్‌చార్జ్ ఎస్‌ఎఫ్‌ఏ అంజలి మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.