Take a fresh look at your lifestyle.

18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి : కొండమడుగు నర్సింహ్మ

ముద్ర, బీబీనగర్ :
ఈనెల 18, 19 తేదీలలో రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల సందర్భంగా 18వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న బహిరంగలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, పేదలు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.
మంగళవారం బీబీనగర్ మండల కేంద్రంలోని కూలీ వాడలో జిల్లా మహాసభల ” కరపత్రం ” ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సింహ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక కూలీ, భూమి, ఉపాధి, సంక్షేమం, విద్య, వైద్యం, కూలీ పేటలో అభివృద్ధిపై నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తూ వ్యవసాయ కూలీలకు అండగా సంఘం నిలిచిందని తెలిపారు. చేపట్టబోయే ఉద్యమాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొలిచెలిమి ప్రసన్న, కార్యదర్శి గాడి శ్రీనివాస్, మండల నాయకులు బండారు శ్రీరాములు, గ్రామ నాయకులు, వ్యవసాయ కార్మికులు సాకలి మంజుల, కుమారి, పేరబోయిన బాల్ నర్సింహ, కొలిచెలిమి గండయ్య, సాకలి శివ ,
బాలరాజు, ధ్రువచంద్ర , ఈశ్వర్ , రాజేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.